కాంగ్రెస్‌కు ప్రజలే బలగం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రజలే బలగం

Feb 14 2026 10:07 AM | Updated on Feb 14 2026 10:07 AM

కాంగ్రెస్‌కు ప్రజలే బలగం

కాంగ్రెస్‌కు ప్రజలే బలగం

గెలుపుతో మరింత ఉత్సాహంగా పని చేస్తాం

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే బలగం, బలమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం రాత్రి హుస్నాబాద్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 90 శాతం పైగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజల ఆశీర్వాదించారన్నారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తున్నదని మున్సిపల్‌ తీర్పుతో మరింత ఉత్సాహంతో ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అర్బన్‌ ప్రాంతాలకు రావాల్సిన నిధులను మంజూరు చేసి అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, నాయకులు కేడం లింగమూర్తి, మంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయంలో

సంబరాలు

హుస్నాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థులు పెద్దఎత్తున సంబరాలు నిర్వహించారు. గెలిచిన వారికి పూల దండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టపాసులు కాల్చి, ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ గెలిపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement