మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు

Feb 14 2026 10:07 AM | Updated on Feb 14 2026 10:07 AM

మంత్ర

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం స్పెల్‌బీ పోటీలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం

సిద్దిపేటఅర్బన్‌: సిద్దిపేట ఐటీ హబ్‌లో పని చేసే ఉద్యోగులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐటీ హబ్‌లో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పినట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సంతోష్‌, నితీష్‌, శశాంక్‌, శ్యాం ఉన్నారు.

గజ్వేల్‌రూరల్‌: స్థానిక బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌లోగల ప్రభుత్వ ఆదర్శ గురుకుల(జీఎంఆర్‌) పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సీహెచ్‌వీ కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమో కోర్సులలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 24వరకు కొనసాగుతాయని తెలిపారు. గజ్వేల్‌లోని జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో డీఈసీఈ(డిప్లొమో ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌), డీఎంఈ(డిప్లొమో ఇన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌), డీసీసీపీ(డిప్లొమో ఇన్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఏఐఅండ్‌ఎంఎల్‌(డిప్లొమో ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌) కోర్సును నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతమున్న డీసీసీపీ కోర్సును డీసీఏఎంబీ(డిప్లొమో ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)గా మార్చినట్లు తెలిపారు. కళాశాల ఆవరణలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9676841339లో సంప్రదించాలన్నారు.

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్ధిపేట): స్పెల్‌బీ వంటి పోటీలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్పెల్‌బీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డీఈఓ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్‌లలో రాణించాలన్నారు. పదోతరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలన్నారు. ఈ పోటీలలో ఇందిరానగర్‌ విద్యార్థి ఆశ్రిత ప్రథమ స్థానం, జెడ్పీహెచ్‌ఎస్‌ తొగుట విద్యార్థి విజయ్‌ ద్వితీయ స్థానం, టీజీఎంఎస్‌ నాగసముద్రాల విద్యార్థి సంజన తృతీయ స్థానం సాధించారు. విజేతలకు బహుమతులను అందించారు.

గురుకులం.. కోలాహలం

వర్గల్‌(గజ్వేల్‌): వార్షికోత్సవ సంరంభంతో వర్గల్‌ పూలే బాలికల గురుకులం అలరారింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్థానిక జ్యోతిబాపూలే బీసీ బాలికల స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి. వార్షికోత్సవ సంరంభానికి బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు, ఐఆర్‌ఎస్‌ అధికారి శోభన్‌బాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మెదక్‌ ఆర్సీఓ రాజేశం, నవోదయ ప్రిన్సిపాల్‌ రాజేందర్‌, ఆతిథ్య గురుకుల ప్రిన్సిపాల్‌ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ‘రామాయణం’ నాటక ప్రదర్శనతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అతిథుల ప్రశంసలు చూరగొన్నారు. హర్యానా డ్యాన్స్‌తో వర్గల్‌ నవోదయ బాలికలు ప్రత్యేకత చాటుకున్నారు. అనంతరం కళాశాల, పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ప్రతీకగా తీర్చిదిద్దిన ‘అస్త్ర’ మ్యాగజైన్‌ను అతిథులు విడుదల చేశారు.

మంత్రి శ్రీధర్‌బాబును  కలిసిన ఐటీ ఉద్యోగులు 
1
1/2

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు

మంత్రి శ్రీధర్‌బాబును  కలిసిన ఐటీ ఉద్యోగులు 
2
2/2

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement