22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య | - | Sakshi
Sakshi News home page

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య

Feb 14 2026 10:07 AM | Updated on Feb 14 2026 10:07 AM

22 ఏళ

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య సెంటిమెంట్‌గా సింహం గుర్తు

దుబ్బాకలోని లచ్చపేట మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థుల అనుచరుల సందడి..

దుబ్బాకటౌన్‌: దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని 1 వార్డు నుంచి 22 ఏళ్ల కోటగళ్ల రమ్య కౌన్సిలర్‌గా గెలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి సత్తాచాటారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కాల్వ రజితపై 241 మెజార్టీ ఓట్లు సాధించి ఈ ఘనత సాధించారు. దీంతో రమ్యను పలువురు అభినందించారు.

గతంలో భార్య.. ఇప్పుడు భర్త

దుబ్బాకటౌన్‌: దుంపలపల్లి 4 వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి అధికం బాలకిషన్‌ గెలుపొందారు. గతంలో ఈయన భార్య అధికం సుగుణ 5 వార్డు నుంచి గెలిచి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. అప్పుడు భార్య వైస్‌ చైర్‌పర్సన్‌, ఇప్పుడు భర్త కౌన్సిలర్‌గా గెలుపొందడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

నాడు ఓడి.. నేడు గెలిచి

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ పరిధిలో 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో గతంలో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచారు. 1వ వార్డు, 5వ, 7వ, 10వ, 12వ వార్డుల నుంచి గెలిచిన వెంకటమ్మ, దుర్గయ్య, ప్రసాద్‌, ఉమ, షరీఫాబేగంలు గత ఎన్నికల్లో అదే వార్డుల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 8వ, 9వ వార్డుల నుంచి గెలిచిన సురేష్‌, సదానందంలు కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. ఇక 3వ వార్డులో గెలిచిన రాజేశ్వరి భర్త నర్సింగరావు ఆదేవార్డులో గతఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతఎన్నికల్లో ఓడిపోయిన వీరందరికీ ఈసారి సానుభూతి పనిచేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

గతంలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసిన కూరపాటి బంగారయ్య.. అప్పటి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడుగు రాజుపై గెలుపొందారు. ఈసారి బంగారయ్య బీఆర్‌ఎస్‌ నుంచి.. బడుగు రాజు ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ(సింహం గుర్తు) నుంచి పోటీ చేయగా.. బీఆర్‌ఎస్‌పై 103 ఓట్లతో రాజు గెలుపొందారు.

కప్పు సాసర్‌ గుర్తుపై నాడు భార్య.. నేడు భర్త

దుబ్బాకటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సెంటిమెంట్‌ మంత్రం పని చేసింది. మున్సిపల్‌ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన నందాల శ్రీజ గత ఎన్నికల్లో కప్పు సాసర్‌ గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. ఈసారి సైతం భర్త శ్రీకాంత్‌ అదే గుర్తుపై పోటీ చేసి 76 ఓట్లతో గెలుపొందడం విశేషం.

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య 1
1/3

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య 2
2/3

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య 3
3/3

22 ఏళ్లకే కౌన్సిలర్‌గా రమ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement