అభివృద్ధే ముఖ్యం
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పాలకవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంతక ముందు గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించారన్నారు. హుస్నాబాద్ చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల కేంద్రాల మాదిరి మరింత ప్రగతి బాట పట్టిస్తామన్నారు. హుస్నాబాద్‌లో మౌలిక సదుపాయాలు, వారి స్థితిగతులు మెరుగుపరుస్తామన్నారు. హుస్నాబాద్ అభివృద్ధిలో ఒక మోడల్‌గా రూపొందిస్తామన్నారు. శాసనసభ్యుడిగా పాలకవర్గానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


