సాగునీటి కోసం రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కోసం రైతుల ధర్నా

Feb 7 2026 3:02 PM | Updated on Feb 7 2026 3:02 PM

సాగున

సాగునీటి కోసం రైతుల ధర్నా

రోడ్డుపై బైఠాయించి నిరసన

సిద్దిపేటరూరల్‌: యాసంగికి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి వద్ద ముస్తాబాద్‌ ప్రధాన రోడ్డుపై చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్‌ గ్రామాల రైతులు మల్లన్నసాగర్‌ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు సైతం ఎండిపోయాయన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికై నా సాగునీటిని వదిలి పంటలను రక్షించాలన్నారు. సీఐ శ్రీను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

సమస్యల ప్రతిబింబమే ఒగ్గుకథ

గజ్వేల్‌రూరల్‌: సమకాలిన సమాజంలో ఉన్న సమస్యల ప్రతిబింబమే ఒగ్గు కథ అని, కాలానుగుణంగా నిత్యనూతనంగా విరాజిల్లుతోందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఒగ్గుకథ గతం–వర్తమానం–భవిష్యత్‌ అనే అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు జరిగిన కార్యక్రమానికి హాజరైన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కళారూపం ఒగ్గు కథ అని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా ఒగ్గు కథ సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టర్‌ మహేందర్‌రెడ్డి పరిశోధన చేసిన గ్రంధాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సుబ్బాచారి, జరిపల్లి అశోక్‌, సుదర్శనం, వైస్‌ ప్రిన్సిపాల్‌ గణపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రకృతిని పరిరక్షిద్దాం

సిద్దిపేటఅర్బన్‌: గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు గురి కాకుండా ప్రకృతిని పరిరక్షించుకునే విధంగా వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్‌ అన్నారు. విజ్ఞాన దర్శిని నెహ్రూ సెంటర్‌, నేచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అర్బన్‌ మండలం మిట్టపల్లి శివారులోని సురభి వైద్య కళాశాలలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్‌, కవి, గాయకుడు జయరాజ్‌ ప్రకృతి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గంజి ఈశ్వరలింగం, కళాశాల డీన్‌ రఫీ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వి శైలజ, అనాటమీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సమతరోషిని, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే

పేదలకు న్యాయం

డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు

చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్‌ పార్టీ పేదల పార్టీ అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. చిన్నకోడూరుకు చెందిన మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ నియామకపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రూపులకు అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి మండలంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, నర్సింహులు తదితరులు ఉన్నారు.

సాగునీటి కోసం రైతుల ధర్నా 1
1/3

సాగునీటి కోసం రైతుల ధర్నా

సాగునీటి కోసం రైతుల ధర్నా 2
2/3

సాగునీటి కోసం రైతుల ధర్నా

సాగునీటి కోసం రైతుల ధర్నా 3
3/3

సాగునీటి కోసం రైతుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement