ధర్మ రక్షణే లక్ష్యం కావాలి
జిల్లా కేంద్రంలో ఘనంగా శివాజీ జయంతి
భారీ బైక్ ర్యాలీ
సిద్దిపేటజోన్: ఛత్రపతి శివాజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని, హిందూ ధర్మ రక్షణ లక్ష్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం ఛత్రపతి శివాజి జయంతి సందర్భంగా పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాత్రి శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జాతీయ సాహిత్య పరిషత్ ప్రతినిధి భాస్కర యోగి, హిందూ వాహిని సంఘటన కార్యదర్శి యాదగిరి, ప్రతినిధులు శ్రీనివాస్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.


