ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి

● ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ

● ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలని, ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఉద్యాన శాఖ జిల్లా అధికారి సువర్ణ సూచించారు. గురువారం మద్దురు మండల కేంద్రంలో సాగుచేస్తున్న మధుసుదన్‌రెడ్డికి చెందిన 3 ఎకరాల డ్రాగన్‌ పంటను, రేబర్తి గ్రామంలో లింగారెడ్డికి చెందిన ఆయిల్‌ పామ్‌ పంటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడం వలన రైతులకు, వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అంతర పంటగా మునగ, వేరుశనగ సాగు చేసి అధిక రాబడి పొందారన్నారు. ఇప్పటి వరకు 17టన్నుల పంట తీసి దర్శంగా నిలుస్తున్నారన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు చెపట్టడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందన్నారు. మామిడిలో పూత దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. ప్రస్తుతం కూరగాయల బాక్స్‌లకు, బ్యాగులకు, యంత్రాలకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఉందని రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి కౌసల్య, ఆయిల్‌ ఫెడ్‌ ఫీల్డ్‌ ఇన్‌చార్జి రాకేష్‌, ఏఈఓ రాజు, డ్రిప్‌ సిగ్నెట్‌ అధికారులు సతీష్‌, నరేశ్‌,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement