నిఘా నీడన ఇంటర్ పరీక్షలు
● పకడ్బందీ ఏర్పాట్లు చేశాం ● ‘సాక్షి’తో డీఐఈఓ రవీందర్‌రెడ్డి ● పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షా కేంద్రాల గుర్తింపు, సౌకర్యాలు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో కంటే ఈసారి అన్ని పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. దీంతో పాటు విద్యార్థుల హాల్‌టికెట్‌లో లొకేషన్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాం.
● అలాంటిది ఏమీ లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని పరీక్షా కేంద్రల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశాం.
● పరీక్షల విధులను కేటాయించే విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. పూర్తిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ) ద్వారా ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి విధులను కేటాయించాం.
● అదంతా తప్పుడు ప్రచారం. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులందరితో కలిసి చర్చించే నిర్ణయాలను తీసకుంటాం. ఇప్పటికీ రెండు సార్లు కలెక్టర్ అధ్యక్షతన ఆయా శాఖలతో కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా పరీక్షలను నిర్వహిస్తాం.
● చేశాం. కన్వీనర్, డీఈసీ మొత్తం నలుగురు, ఇద్దరు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, ఏడుగరు కస్టోడియన్‌లు, 42 సీఎస్, 42 డీఓ, 42 ఏఎన్‌ఎం, 84 మంది పోలీస్ సిబ్బంది సుమారు 500ల మంది ఇన్విజిలెటర్లను నియాకం చేశాం. సీఎస్, డీఓ, స్క్వాడ్ సభ్యులందిరికి శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహిస్తాం.
● ప్రశ్నపత్రాలను జిల్లాలోని 5 స్టోరేజ్ పాయింట్లలో (పోలీస్ స్టేషన్‌లు) రెండ్రోజుల ముందుగా పంపిస్తాం. జవాబు, ఓఎంఆర్ పత్రాలను సంబంధిత కేంద్రాలకు నేరుగా పంపిస్తాం.
● జీవితం ఎంతో విలువైంది. విద్యార్థులు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలి. ఒత్తిడికి గురైతే సంబంధిత కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్‌ను, లేక టెలీమానస్ 14416 నంబర్‌లో సంప్రదించాలి. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఏమైన అనుమానాలు ఉంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 99493 30191 నంబర్‌లో, మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 9010120356 నంబర్‌లలో సంప్రదించాలి. పరీక్షల నిర్వహణ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులను నిర్వర్తించాలి.
మొత్తం 20,042 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్ 7,387, ఒకేషనల్ 2,559 మొత్తం 9946 మంది. సెకండియర్ జనరల్ 7,705, ఒకేషనల్ 2,384 మొత్తం 10,089 మంది. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 20,035 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈసారి మిట్టపల్లిలో సెంటర్‌ను ఏర్పాటు చేయలేదు. తప్పని పరిస్థితిలో ఎన్సాన్‌పల్లిలో సెంటర్ కొనసాగిస్తున్నాం.
ఈనెల 25 నుంచి ప్రారంభం
● పకడ్బందీ ఏర్పాట్లు చేశాం ● ‘సాక్షి’తో డీఐఈఓ రవీందర్‌రెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: ‘ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి పరీక్షలు నిఘా కెమెరాల మధ్య జరగనున్నాయ’ని పరీక్షల కమిటీ కన్వీనర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించిన పలు అంశాలు ఇలా ఉన్నాయి.
పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఈసారి కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా?
ప్రైవేట్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదట నిజమేనా?
పరీక్షా నిర్వహణ విధుల కేటాయింపు అధ్యాపక సంఘాల ఒత్తిడితో చేశారనే ఆరోపణలు ఉన్నాయి?
పరీక్షల నిర్వహణ నిర్ణయాలను మీరే సొంతంగా తీసుకున్నట్లు సమాచారం. మీరేమంటారు?
సీఎస్, డీఓ, స్క్వాడ్‌ల నియామకం చేశారా?
ప్రశ్నపత్రాల పంపిణీ జరిగిందా? ఎలా చేస్తారు?
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, నిర్వహణ అధికారులు, సిబ్బందికి మీరిచ్చే సలహాలు, సూచనలు..
జిల్లా వ్యాప్తంగా ఎంతమంది
విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు?
మొత్తం ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు?