‘గజ్వేల్‌’లో పెండింగ్‌ పనులే అధికం | - | Sakshi
Sakshi News home page

‘గజ్వేల్‌’లో పెండింగ్‌ పనులే అధికం

Feb 18 2026 8:33 AM | Updated on Feb 18 2026 8:33 AM

‘గజ్వేల్‌’లో పెండింగ్‌ పనులే అధికం

‘గజ్వేల్‌’లో పెండింగ్‌ పనులే అధికం

● ఈ మున్సిపాలిటీలో గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, ముట్రాజ్‌పల్లి, సంగుపల్లి, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్‌ గ్రామాలతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఉంది.

● ఇక్కడ 88,827జనాభా, 46,740 ఓటర్లు ఉన్నారు.

● ఎన్నో సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రూ. 230 కోట్ల వ్యయంతో చేపట్టిన రింగు రోడ్డు అనుసంధానం అసంపూర్తిగా ఉంది.

● ప్రధాన రహదారికి వరద నీరు వెళ్లే మార్గం లేక.. వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారి జలదిగ్భంధంలో చిక్కుకుంటోంది.

● రూ.156కోట్ల వ్యయంతో చేపట్టిన యూజీడీ పనులు సక్రమంగా జరగకపోవడం వల్ల తరుచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీలను నివారించడానికి జెట్టింగ్‌ యంత్రం లేదు. విలీన గ్రామాల్లో యూజీడీ ఊసే లేదు.

● పట్టణంలో అంతర్గత రోడ్లు ఛిద్రమై నరకం చూపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement