కబడ్డీ సీనియర్ జట్టుకు ఎంపిక
అక్కన్నపేట(హుస్నాబాద్): చౌటపల్లికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు పులికాశి వంశీకృష్ణ రాష్ట్ర సీనియర్ జట్టుకి ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పత్తిపాక లావణ్య, మాజీ సర్పంచ్ గద్దల రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులకు కేరాఫ్ చౌటపల్లి పుట్టినిల్లుగా నిలుస్తోందన్నారు. ఈ గ్రామం నుంచి అనేకమంది కబడ్డీతో పాటు వివిధ క్రీడాల్లో జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. అందులో భాగంగా వంశీకృష్ణ జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంపిక కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.


