పక్కాగా కొలతలు, హక్కులు
8లో
న్యూస్‌రీల్
సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాయి పల్లెలు. గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల్లోని మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పల్లెల్లో బెల్ట్‌షాపులు పెరిగిపోవడం.. సంపాదించిన డబ్బంతా మద్యం తాగేందుకే ఖర్చు పెడుతండటంతో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. పైగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజలంతా ఏకమై మద్యం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఆస్తులకు కచ్చితమైన సరిహద్దులు.. యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నక్ష ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష (నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్) పైలెట్ ప్రాజెక్ట్ ఇప్పుడు హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికై న 157 మున్సిపాలిటీల్లో తెలంగాణ నుంచి 10 పట్టణాలు చోటు దక్కగా అందులో హుస్నాబాద్ ఒకటి. ఇప్పటికే పట్టణాన్ని 100 బ్లాకులుగా విభజించి 8 వార్డుల వారీగా సర్వే చేస్తున్నారు. గతంలో ఇంటి విస్తీర్ణం పై డ్రోన్లు, ఏరియల్ సర్వే చేసిన అధికారులు ఇప్పుడు ఇంటింటికి నేరుగా వెళ్లి కొలతలు వేస్తున్నారు. ఖాళీ స్ధలాలు, ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్‌లు ఇలా ప్రతీ అంగుళాన్ని నమోదు చేస్తున్నారు.
– హుస్నాబాద్:
ఆస్తులకు
డిజిటల్ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూమి రికార్డులను నవీకరించడం, డిజిటలైజ్‌చేయడం, పట్టణ ప్రణాళిక, మెరుగైన పౌర సేవల కోసం కచ్చితమైన జీఐఎస్ ఆధారిత మ్యాప్‌లను తయారు చేయనున్నారు. ఆస్తి యాజమానులకు స్ఫష్టమైన హక్కుల దృవీకరణ ఇవ్వనున్నారు. ఆస్తికి ఇచ్చె డిజిటల్ కార్డు ఆధార్ కార్డుగా ఉపయోగపడుతుంది. యాజమాని ఆస్తికి ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తారు. సర్వే తర్వాత ఇచ్చే పత్రం పక్కాగా ఉంటుంది. ఒక సారి పత్రం ఇస్తే కబ్జాల భయం ఉండదు. సరిహద్దు తగాదాలు పూర్తిగా తగ్గనున్నాయి. ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) కట్టడం నుంచి మ్యుటేషన్ వరకు అంతా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం అవుతుంది. డిజిటల్ కార్డును ఓపెన్ చేస్తే ఇంటి యాజమాని ఆస్తుల వివరాలు తెలిసేలా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. డిజిటల్ కార్డుతో ప్రాపర్టీ విలువ పెరగడంతో పాటు బ్యాంకుల్లో అప్పులు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఒక్క సారి ఆన్‌లైన్‌లో డేటా నమోదు అయితే భవిష్యత్‌లో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
భూ రికార్డులు ఇక ఆధునీకరణ ● హుస్నాబాద్‌లో ప్రారంభమైన డిజిటల్ సర్వే
అవగాహన కల్పిస్తాం
డిజిటల్ సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తాం. త్వరలో ప్రతి వార్డులో పట్టణ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. నక్షా సర్వేలో ప్రజలు తప్పని సరిగా భాగస్వాములు కావాలి. డిజిటల్ మ్యాపింగ్‌కు ప్రజలు సహకరించాలి. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు భూమి పత్రాలు చూపించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆస్తుల భద్రత, పారదర్శకతకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
– మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్
మరో లక్ష ఎకరాలకు సాగునీరు
ప్రజల్లో అపోహలు..
డిజిటల్ సర్వే కోసం వచ్చే అధికారుల టీమ్ ఇంటికి వస్తే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్నులు పెంచుతారేమోనని, ఖాళీ ప్రదేశాలను ప్రభుత్వం తీసుకుంటుందేమోనని ప్రజల్లో అపోహలు వెంటాడుతున్నాయి. వివరాలు చెప్పేందుకు ఒకటికి, రెండ్లు సార్లు ఆలోచిస్తున్నారు. ఇది పూర్తిగా ఆస్తుల భద్రత కోసమేనని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ సర్వేపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇంటి పన్నులు పెంచారని గగ్గోలు పెడుతున్న ప్రజలు ఖరీదైన ఖాళీ స్ధలాల వివరాలు చెప్పేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చి నాటికి టార్గెట్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పక్కాగా కొలతలు, హక్కులు
పక్కాగా కొలతలు, హక్కులు
పక్కాగా కొలతలు, హక్కులు
పక్కాగా కొలతలు, హక్కులు


