క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

Feb 22 2026 8:37 AM | Updated on Feb 22 2026 8:37 AM

క్రీడ

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడల్లో చురుగ్గా పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని.. ఆలోచన శక్తి కూడా మెరుగవుతుందని, చిన్నప్పటి నుంచే పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకోవాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చంద్లాపూర్‌ శివారులోని రంగనాయక సాగర్‌పై రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలపై తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఆటలతో పాటు విద్యలో ముందుంటే ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకోవాలన్నారు. రోజులో గంట సమయం వ్యాయామం, వాకింగ్‌, రన్నింగ్‌కు కేటాయించాలన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి వెంకటనర్సయ్య, జిల్లా సైకిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లా స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి సౌందర్య, కోచ్‌ సంజీవ్‌, రూరల్‌ సీఐ శ్రీను, ఎస్‌ఐ చంద్రమోహన్‌, సర్పంచ్‌ శేఖర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

రంగనాయక సాగర్‌పై సైక్లింగ్‌ పోటీలు

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం 1
1/1

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement