అభ్యర్థిని ఖరారు చేసి బయటకు పొక్కకుండా బీఆర్‌ఎస్‌ జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థిని ఖరారు చేసి బయటకు పొక్కకుండా బీఆర్‌ఎస్‌ జాగ్రత్తలు

Feb 16 2026 8:45 AM | Updated on Feb 16 2026 8:45 AM

అభ్యర్థిని ఖరారు చేసి బయటకు పొక్కకుండా బీఆర్‌ఎస్‌ జాగ్ర

అభ్యర్థిని ఖరారు చేసి బయటకు పొక్కకుండా బీఆర్‌ఎస్‌ జాగ్ర

అభ్యర్థిని ఖరారు చేసి బయటకు పొక్కకుండా బీఆర్‌ఎస్‌ జాగ్రత్తలు

గజ్వేల్‌: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పేరును ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం..‘సీల్డ్‌ కవర్‌’లో భద్రపరిచింది. చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను బీఆర్‌ఎస్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండిపెండెంట్‌తో కలుపుకొని వారి కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. కాగా చైర్మన్‌ అభ్యర్థి పేరును ఎన్నిక సమయానికే బయటపెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అభ్యర్థులకు ‘విప్‌’జారీ చేసిన పార్టీ నేతలు..‘సీల్డ్‌ కవర్‌’లో అధిష్టానం ఎవరి పేరు పంపితే వారికి చేతులు ఎత్తి మద్దతు పలకాలని గట్టిగా ఆదేశించినట్లు తెలిసింది.

తెరపైకి అనూహ్యంగా మూడో పేరు..?

చైర్మన్‌ పోటీలో నిన్నమొన్నటి వరకు ప్రధానంగా 17వవార్డు కౌన్సిలర్‌ కళ్యన్‌కర్‌ పద్మబాయి, 19వవార్డు కౌన్సిలర్‌ గంగిశెట్టి చందన పేర్లు మాత్రమే ఉండగా... కొద్ది గంటల కిందట మరొకరి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. మూడో పేరు అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటుందా...? లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇకపోతే పట్టణంలో చైర్మన్‌ ఎన్నికపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ప్రత్యేకించి వాట్సాప్‌ గ్రూపుల్లో, ఇతర సోషల్‌ మీడియా వేదికగా ఓటింగ్‌లు కూడా చేపడుతున్నారు. ప్రధానంగా కళ్యన్‌కర్‌ పద్మబాయి, గంగిశెట్టి చందనల పేర్లను ప్రస్తావిస్తూ..వీరిలో ఎవరైతే బాగుంటుందనే అంశంపై డిబేట్‌లు సైతం నిర్వహించడం ఆసక్తి రేకెత్తిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్‌ సైతం చైర్మన్‌ పీఠంపై కన్నేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కేసీఆర్‌ ఎక్స్‌ అఫీషియోపై అంతా ఆసక్తి

ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎమ్మెల్యే కేసీఆర్‌ ఎక్స్‌అఫీషియో ఓటు నమోదు కావడంపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఓటు నమోదు చేసుకున్నారంటే నిజంగానే కేసీఆర్‌ ఇక్కడికి వచ్చే అవకాశముందా..? అనే చర్చ కూడా నడుస్తోంది. పరిస్థితులను బట్టి కేసీఆర్‌ రావడం, లేదా..? అనేది ఆధారపడి ఉండొచ్చని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఎన్నిక సమయానికి నేరుగా మున్సిపల్‌ కార్యాలయానికి..

క్యాంపులో ఉన్న 11మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, మరొక ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ చైర్మన్‌ ఎన్నిక సమయం 11గంటలు కాగా, 10.45వరకే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. చైర్మన్‌తోపాటు వైస్‌ చైర్మన్‌ పేరును సైతం ‘సీల్డ్‌ కవర్‌’లోనే భద్ర పరిచి ఎన్నిక సమయానికి బయటకు వెల్లడించే అవకాశం కనిపిస్తున్నది.

ఎన్నిక సమయానికే పేరును వెల్లడించే అవకాశం

ఇప్పటికే అభ్యర్థులకు ‘విప్‌’జారీ

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement