నేడు ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజావాణి రద్దు

Feb 16 2026 8:45 AM | Updated on Feb 16 2026 8:45 AM

నేడు

నేడు ప్రజావాణి రద్దు

నేడు ప్రజావాణి రద్దు కౌన్సిలర్‌గా పీహెచ్‌డీ అభ్యర్థి నారాయణఖేడ్‌: ఖేడ్‌ మున్సిపాలిటీలో ఎన్నికై న కౌన్సిలర్లలోకెల్లా ఉన్నత విద్యావంతురాలు సురేఖ. ఈమె రెండవ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేసి పీహెచ్‌డీకి సిద్ధమవుతుండగా ఎన్నికలు వచ్చాయి. అయితే రెండో వార్డు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు రిజర్వు కావడంతో మన్సుపూర్‌కు చెందిన సురేఖ పోటీ చేశారు. బడుల మూసివేతను విరమించుకోవాలి సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: హేతుబద్దీకరణ పేరుతో ప్రభుత్వం బడుల మూసివేత ఆలోచనలను విరమించుకోవాలని ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్‌ కార్యాలయంలో విద్యా పరిరక్షణపై ఆదివారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పాఠశాలలను మూసి వేసే కుట్రకు పూనుకుందన్నారు. పాఠశాలలను మూసి వేయడాన్ని పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని అభివర్ణించారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, అందులో భాగంగానే పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి పాఠశాలలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తన వంతు బాధ్యతతో గుణ్మాతక విద్యను అందిస్తే విద్యార్థులు నమోదు పెరుగుతుందన్నారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి తీరని అన్యాయం జరిగిందని, బడ్జెట్‌ తగ్గించడం ద్వారా విద్య ప్రైవేట్‌పరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కామన్‌ విద్యా విధానం కలగానే మిగిలిపోయిందని, ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యం అందించినపుడే సమాజం బాగుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు సంజీవయ్య, రాంచందర్‌, సోమశేఖర్‌, లక్ష్మయ్య యాదవ్‌, అన్వర్‌, సాయిలు, నాసర్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. కేతకీ.. శివోహం

కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటరూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ కె.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని తెలిపారు.

కౌన్సిలర్లలోనే ఉన్నత విద్యావంతురాలు

ఝరాసంగం(జహీరాబాద్‌): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 దాటగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాల పూజ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. క్యూలలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గత 41 రోజులుగా శివమాల ధరించిన భక్తులు ఇరుముడి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు.

పూజలు నిర్వహించిన మంత్రి దామోదర

మహాశివరాత్రిని పురస్కరించుకుని కేతకీలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతాపాటిల్‌, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావుపాటిల్‌, పాలక మండలి చైర్మన్‌ చంద్రశేఖర్‌ పాటిల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నేడు ప్రజావాణి రద్దు 
1
1/1

నేడు ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement