జబ్బాపూర్‌ను సందర్శించిన డీఈఓ
● పాఠశాల భవన నిర్మాణ పనుల పరిశీలన ● యజమానికి అద్దెబకాయిల చెక్కు అందజేత
వర్గల్(గజ్వేల్): విద్యార్థులకు సౌకర్యవంతంగా పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు త్వరితగతిని పూర్తిచేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం వర్గల్ మండలం జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అద్దె బకాయల కోసం బడికి తాళం వేసిన సంఘటనపై విచారణ జరిపారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల అద్దెభవన యజమాని హరికృష్ణకు రూ. 12,000 అద్దె బకాయలు చెక్‌రూపంలో అందజేశారు. అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుందని, అద్దె కోసం మండల విద్యాధికారిని సంప్రదిస్తే చాలని డీఈఓ సూచించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం ఎస్‌డీఎఫ్ నిధులతో నిర్మిస్తున్న పాఠశాల నూతన భవన నిర్మాణపనులు పరిశీలించారు. పనుల పురోగతిని ఏఈ తేజకుమార్‌తో సమీక్షించారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణపనులు పూర్తిచేయాలని ఏఈని, సంబంధిత కంట్రాక్టర్లను డీఈఓ ఆదేశించారు. పాఠశాల నిర్వహణకు ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్డులో వంటల కోసం కిచెన్‌షెడ్డు, ఒక గదికి తాళం వేసుకునేలా డోర్లు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు.


