మంత్రి పొన్నంను కలిసిన నేతలు
ములుగు(గజ్వేల్): ఏఐసీసీ రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు కడపల్ల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘటన్ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నర్సింహారెడ్డి నగరంలోని మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక క్రీడా పోటీలను సీపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్ర పోలీసు క్రీడల్లో పోలీసు కమిషనరేట్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబర్చి మూడు బంగారు, రెండు వెండి, ఏడు కాంస్య పతకాలు సాధించారన్నారు. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అధికారులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్‌తో బంగారు భవిత
చిన్నకోడూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలో చేరి సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత అన్నారు. సోమవారం చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని పదో తరగతి విద్యార్థులకు పాలిసెట్ కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డీసీఈ, డీఈఈఈ, డీఐడీ, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్టల్ వసతి ఉందన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్ దరఖాస్తుకు ఏప్రిల్ 22 చివరి తేదని, మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పాటెక్నిక్ కోర్సులో చేరి అతి తక్కువ ఖర్చుతో నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి అవకాశం ఉందన్నారు.
శాంతిభద్రతల
పరిరక్షణకే కవాతు
సిద్దిపేటకమాన్: ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ రవిందర్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్సు డిప్యూటీ కమాండెంట్ సరస్వతి తమ సిబ్బందితో కలిసి కవాతులో పాల్గొన్నారు.
మంత్రి పొన్నంను కలిసిన నేతలు
మంత్రి పొన్నంను కలిసిన నేతలు
మంత్రి పొన్నంను కలిసిన నేతలు


