కాంగ్రెస్‌ది మోసపూరిత పాలన
గజ్వేల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి మోసపూరిత పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ హయాంలో చేపట్టిన పథకాలు ఆపేశారన్నారు. యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ గజ్వేల్ గౌరవాన్ని జాతీయస్థాయిలో పెంచారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రోడ్లకు గుంతలు పడితే పూడ్చలేని స్థితిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎలాగైనా అక్రమ పద్ధతుల్లో గెలవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడికి డబ్బు సంచులను పంపుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.5వేల కోట్లతో మిషన్ కాకతీయ పనులు జరిగితే...ఆ పథకంలో రూ.55వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేతల తప్పుడు మాటలను నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు


