‘సాక్షి’తో గంగిశెట్టి చందన
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మూడో చైర్‌పర్సన్‌గా ఉన్నత విద్యావంతురాలు గంగిశెట్టి చందన రవీందర్ ఎన్నికయ్యారు. సోమవారం పదవీ స్వీకారం పురస్కరించుకుని ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ఈ సందర్భంగా ప్రజల నమ్మకాన్ని నిలబెడతానంటూ పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా..
సాక్షి: మీకు చాలా పెద్ద బాధ్యత వచ్చింది. ఎలా ఫీలావుతున్నారు?
చైర్‌పర్సన్: చాలా గర్వంగా ఉంది. కేసీఆర్ వల్ల నాకు ఈ అవకాశం దక్కింది. ఈ పదవిని ప్రజ లకు మేలు చేయడానికి పూర్తిగా వినియోగిస్తా..
సాక్షి: పట్టణ అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏమిటీ?
చైర్‌పర్సన్: మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నిధులకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. దాంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవడానికి కొత్త ఆలోచనలతో ముందుకుసాగుతాం.
సాక్షి: పట్టణంలో చాలా అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి... వాటి పరిస్థితి?
చైర్‌పర్సన్: నిజమే. రింగురోడ్డుతోపాటు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అందరి సహకారం తీసుకుంటాం. ప్రత్యేకించి కౌన్సిలర్లను ఎప్పటికప్పుడూ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటా. ప్రజలకు మేలు చేసి వారి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యం.


