మంత్రిపై చర్యలు తీసుకోండి
హుస్నాబాద్: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్‌కు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రచార గడవు ముగిసినా ఓట్లను అభ్యర్థించడం ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమన్నారు. క్యాంప్ కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.


