బాలల ప్రపంచ పుస్తకంలో విశ్వతేజ కథ
చిన్నకోడూరు(సిద్దిపేట): బాలల ప్రపంచ పుస్తకంలో విశ్వతేజ కథకు చోటు దక్కింది. తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు 56 కథలతో బాలల ప్రపంచం అనే కథా సంకలన పుస్తాకాన్ని ముద్రించారు. ఈ పుస్తకంలో మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి విశ్వతేజ రాసిన అడవి తల్లి కథ ఎంపికైంది. పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విశ్వతేజను అభినందించారు.
హుస్నాబాద్‌రూరల్: మండల పరిధి మహ్మదాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ను డీఈఓ సస్పెండ్ చేసినట్లు హెచ్‌ఎం మహేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో 15 రోజుల కిందట విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేయడంతో డీఈఓ విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు హెచ్‌ఎం పేర్కొన్నారు.
రేపు జిల్లా స్థాయి
జట్టు ఎంపిక
సిద్దిపేటజోన్: జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సబ్ జూనియర్ జట్టు ఎంపిక ఈనెల 12న జరగనుందని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాడిచర్లపల్లి శివార్లలోని స్టీఫెన్ హై స్కూల్‌లో ఎంపిక ఉంటుందన్నారు. ఎంపిక కోసం వచ్చే విద్యార్థులు ఆధార్ కార్డ్ జిరాక్స్, బోనఫైడ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
14న ఫుట్‌బాల్ టోర్నీ..
ఈనెల 14న జిల్లా స్థాయి ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అక్బర్ పేర్కొన్నారు. జూనియర్ బాలికల, సబ్ జూనియర్ బాలల విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. సబ్ జూనియర్ కోసం అండర్–14, అదేవిధంగా జూనియర్ బాలికల కోసం అండర్–16 కేటగిరీలుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వర్గల్(గజ్వేల్): కూరగాయలు సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా రాయితీపై ట్రే బాక్సులు అందజేస్తున్నట్లు ఉద్యాన విస్తరణాధికారి అరవింద్ తెలిపారు. అవసరమైన రైతులు పట్టాదార్ పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోను జతచేసి ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం 9704389852 నంబర్‌ను సంప్రదించవచ్చని రైతులను కోరారు.
గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం మునిగడపలో బెల్ట్‌షాపులను నడపొద్దని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బాలయ్య, ఉప సర్పంచ్ కిషన్‌యాదవ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదించారు. తీర్మాన కాపీని ఎకై ్సజ్ శాఖ అధికారులకు అందజేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఎవరైనా బెల్ట్‌షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
టీజీఎస్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వబోమని టీజీఎస్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ ప్రతిమా షోమేను అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్టోర్‌ను సందర్శించారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు, 11 కేవీ, 33 కేవీ లైన్ పనులు, సబ్‌స్టేషన్ పనులకు అవసరమైన ప్రధాన సామగ్రి లభ్యతను సమీక్షించారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని, ప్రతి వినియోగదారుడికి విద్యుత్‌ను అందించే విధంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
బాలల ప్రపంచ పుస్తకంలో విశ్వతేజ కథ


