చైర్మన్ గిరిపై పీటముడి
తూప్రాన్: తూప్రాన్ పురపోరులో బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. చైర్మన్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. చైర్మన్‌గిరి విషయంలో విభేదాలు పొడచూపుతున్నట్లు తెలుస్తుంది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 9 బీఆర్‌ఎస్, 4 కాంగ్రెస్, 3 బీజేపీ కై వసం చేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌కు స్థానాలు వచ్చినా.. గ్రూపు రాజకీయాలతో మూడు వర్గాలుగా చీలినట్లు తెలిసింది. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లతో హరీశ్‌రావు మంతనాలు సాగిస్తున్నారు. కాగా హరీశ్ అండదండలతో మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ చక్రం తిప్పుతుండగా.. ప్రతాప్‌రెడ్డి అండదండలతో చెలిమెల రఘుపతి (ప్రియాంక), సమతారెడ్డి తమకే పీఠం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు గెలిచి బీజేపీ మూడు స్థానాలు గెలిచిన వారితో జతకట్టి తూప్రాన్ మున్సిపల్ అధికార పార్టీ కై వసం చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో బీజేపీ సైతం తాము మూడు స్థానాలు గెలిచామని, తామే కీలకం కానున్నామని చెబుతున్నారు. మొత్తానికి బీఆర్‌ఎస్ అంతర్గత కుమ్ములాటలు కొంపముంచుతాయా అనే చర్చ సాగుతోంది.
చైర్మన్ గిరిపై పీటముడి


