కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే నిధులు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే నిధులు

Feb 8 2026 7:56 AM | Updated on Feb 8 2026 7:56 AM

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే నిధులు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే నిధులు

గజ్వేల్‌: రాష్ట్ర ఖాజానాపై భారం పడుతున్నా.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్‌ అన్నారు. శనివారం గజ్వేల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధికి నిధులు వచ్చే అవకాశమున్నదని చెప్పారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మైనార్టీలు కీలక పాత్ర పోషించి కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్‌లో మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల్లో తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సర్ధార్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అజహరుద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement