గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే హరీశ్‌రావు
పాలమాకుల గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న హరీశ్‌రావు
నంగునూరు(సిద్దిపేట): అందరు ఐకమత్యంగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో పాలమాకులలో ఆదివారం శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమ కాలం నుంచి గ్రామంతో తనకు ఎంతో అనుభందం ఉందన్నారు. మొట్ట మొదటగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు గ్రామం మీదుగా ఫోర్‌లేన్ల రోడ్డు, రింగ్‌రోడ్డు నిర్మాణానికి కృషి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పింఛన్, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎగ్గొట్టి మోసం చేసిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వేణుచక్రవర్తి, సర్పంచ్ ఓజాలు తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ లైబ్రరీకి పుస్తకాల అందజేత
సిద్దిపేటఅర్బన్: విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్సాన్‌పల్లి రెసిడెన్షియల్ స్కూల్ లైబ్రరీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ నాగుల స్రవంతి ఆదివారం పుస్తకాలను ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఇటీవల పాఠశాలను హరీశ్‌రావు సందర్శించిన సందర్భంగా లైబ్రరీకి పలు పుస్తకాలు కావాలని విద్యార్థినులు కోరారు. వారి కోరిక మేరకు రూ. లక్ష విలువైన పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం పుస్తకాలను అందజేసిన హరీశ్‌రావుకు విద్యార్థులు, ప్రిన్సిపాల్, సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.


