12 నుంచి జిల్లా స్థాయి సీఎం కప్
● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
సిద్దిపేటరూరల్: జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు ఈనెల 12, 13, 14 తేదీలలో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ అమీద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి సీఎం క్రీడా పోటీల నిర్వహించనున్నామన్నారు. ఈ క్రీడల్లో డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికై న దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, యోగా, క్యారం, చెస్, కరాటే, బేస్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, హాకీ తదితర 25 క్రీడాంశాలలో పాల్గొననున్నారన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల ను రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడలు నిర్వహించే ప్రదేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, క్రీడాకారులకు భోజనం, వసతి, మెడికల్ క్యాంపు, ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటనర్సయ్య, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, డీపీఆర్‌ఓ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.


