కాంగ్రెస్‌తోనే పట్టణాల అభివృద్ధి
హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 10, 11, 17, 20వ వార్డుల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఈ రెండేళ్లలో జరిగిందన్నారు. హుస్నాబాద్‌ను పెద్ద నగరంగా మార్చేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టును గత ప్రభుత్వం కుర్చీ వేసుకొని కడతామన్నవారు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం పనులు వేగవంతమయ్యాయని, ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. హుస్నాబాద్‌కు గౌరవం పెరగాలంటే, ఇంకా అభివృద్ధి వైపు వెళ్లాలంటే పాలకవర్గం అధికార పార్టీదే ఉండాలన్నారు. చౌటపల్లిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లెల్లగడ్డలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని మంత్రి కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


