దుబ్బాకపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ రేవంత్‌కు ఏదీ?
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: పుట్టి పెరిగి విద్యా బుద్ధులు నేర్చుకున్న దుబ్బాక గడ్డమీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ రేవంత్‌రెడ్డికి ఉంటుందా? ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లాయపల్లి, చెల్లాపూర్ 1, 2, 3 వార్డులతో పాటు దుబ్బాక 13, 14 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పట్టణ, పల్లె వికాసం జరిగితే రేవంత్ పాలనలో వికారంగా మారిందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు.కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
బీడీలు ఎంచుతూ.. ఓటు అడుగుతూ
దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గురువారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బీడీ కార్ఖానలో పనిచేస్తున్న మహిళలను ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల బాగోగులు తెలుసుకొన్నారు. కార్మికులకు పింఛన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించారు.


