18వేల మంది దూరం | - | Sakshi
Sakshi News home page

18వేల మంది దూరం

Feb 12 2026 11:35 AM | Updated on Feb 12 2026 11:35 AM

18వేల మంది దూరం

18వేల మంది దూరం

చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా కానరాని మార్పు

గజ్వేల్‌లో ఓటు హక్కు వినియోగించుకోనివారే అధికం

సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతో మంది తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే. అలాంటి మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు 18,164 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 82.03 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియెగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం.

గజ్వేల్‌లో కదలని ఓటరు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోలింగ్‌ను చూస్తే గజ్వేల్‌ పట్టణ ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరంగా ఉన్నారు. మూడు మున్సిపాలిటీలలో కలిపి 8,515 మంది అయితే.. ఒక్క గజ్వేల్‌ మున్సిపాలిటీలో 9,652 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు.

పల్లెల్లోనే అధికం

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.30శాతం మంది పల్లె ఓటర్లు, తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో 82.03శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ఓటర్ల కంటే పల్లె ఓటర్లే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్లె ఓటర్ల కంటే పట్టణ ఓటర్లు 6.27శాతం మంది తక్కువగా తమ ఓటు హక్కును వినియోగించకున్నారు.

మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు

చేర్యాల 13,777 11,491

దుబ్బాక 21,341 18,147

గజ్వేల్‌ 46,740 37,088

హుస్నాబాద్‌ 19,227 16,192

ఓటు వినియోగించుకోని వారి వివరాలు

మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

చేర్యాల 1,032 1,254 0 2,286

దుబ్బాక 1,491 1,703 0 3,194

గజ్వేల్‌ 4,636 5,016 0 9,652

హుస్నాబాద్‌ 1,432 1,601 02 3,035

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement