టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ హైమావతి
● ఎంఈఓలతో సమీక్ష
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదోతరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని, కలెక్టర్ హైమావతి ఎంఈఓలను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రణాళిక రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్టడీ క్లాస్‌లు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు దగ్గరుండి సబ్జెక్ట్‌లపై అవగాహన కల్పించాలన్నారు. సులభంగా ఎలా చదవాలో మెలకువలు నేర్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ప్రకారం అందరికీ సరిపోయే విధంగా రుచికరంగా వండి విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తుల వేగం పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారులు ముండ్రాతి రమేష్, అన్ని మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.


