పల్లె సారథులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పల్లె సారథులకు శిక్షణ

Jan 14 2026 11:23 AM | Updated on Jan 14 2026 11:23 AM

పల్లె

పల్లె సారథులకు శిక్షణ

● ఒక్కో బ్యాచ్‌లో 50 మంది.. ● ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక శిబిరాలు

ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు కోహెడ, కొమురవెల్లి, నారాయణరావుపేట, చిన్నకోడూరు, దుబ్బాక మండలాల్లోని 98 మంది సర్పంచ్‌లకు..

ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జగదేవ్‌పూర్‌, నంగునూరు, వర్గల్‌, బెజ్జంకి మండలాల్లోని 101 మంది సర్పంచ్‌లు..

ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు ములుగు, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, దౌల్తాబాద్‌, గజ్వేల్‌ మండలాల్లోని 100 మంది సర్పంచ్‌లు..

ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు మద్దూరు, ధూల్మిట్ట, కొండపాక, సిద్దిపేట రూరల్‌, అక్కన్నపేట, సిద్దిపేట అర్బన్‌ మండలాలకు చెందిన 101 మంది సర్పంచ్‌లు..

ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు హుస్నాబాద్‌, అక్బర్‌పేట–భూంపల్లి, తొగుట, మర్కూక్‌, చేర్యాల, రాయపోల్‌ మండలాలకు చెందిన 108 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.

24 అంశాలపై సర్పంచ్‌లకు ట్రైనింగ్‌
● ఒక్కో బ్యాచ్‌లో 50 మంది.. ● ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక శిబిరాలు

జిల్లా వ్యాప్తంగా 90శాతానికిపైగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లే ఉన్నారు. పాలనా పరమైన అనుభవం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులకు విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. గత నెల 22న పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. 508 సర్పంచ్‌లు, 4,506 వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతీ విడతలో రెండు బ్యాచ్‌లు.. ఒక్కో బ్యాచ్‌కు 50 మంది చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 5 రోజుల పాటు శిక్షణ ఉండనుంది. సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లిలోని న్యాక్‌ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

24 అంశాలపై అవగాహన

గ్రామ పాలనలలో వ్యవస్థలు, పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులకు బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, సమావేశాలు, స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధులపై ఆడిట్‌, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్‌, ఆర్థిక ప్రణాళిక ఇలా 24 అంశాల పై శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధి కృషి చేసే విధంగా ప్రోత్సహించనున్నారు. అలాగే పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా వివరించనున్నారు.

శిక్షణకు తప్పక రావాల్సిందే..

సర్పంచ్‌లకు శిక్షణ సమయంలో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఆధార్‌ లింక్‌ ద్వారా బయోమెట్రిక్‌ అంటెండెన్స్‌ను శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు ప్రతి సర్పంచ్‌ తప్పక హాజరు ఉండాలి.

ఎనిమిది మంది మాస్టర్‌ ట్రైనర్లు

సర్పంచ్‌లకు శిక్షణను ఇచ్చేందుకు ఇప్పటికే ఎనిమిది మంది మాస్టర్‌ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రవీణ్‌(ఎంపీడీఓ, గజ్వేల్‌), శ్రీనివాస రావు(ఎంపీవో, నారాయణరావు పేట), మల్లికార్జున్‌ (ఎంపీఓ, కొండపాక), సమ్మిరెడ్డి ( ఎంపీడీఓ రిటైర్డ్‌), రామక్రిష్ణ రెడ్డి(ఎమ్మార్పీ), చెన్నారెడ్డి, ప్రభాకర్‌, (ఏపీఓ, అక్కన్నపేట), శ్రీనివాస్‌ ( ఏపీఎం, నంగునూరు సెర్ప్‌)లు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణలో పాల్గొన్నారు. సర్పంచులకు శిక్షణ ముగిసిన తర్వాత వార్డు సభ్యులకు మండలాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 25 మంది మాస్టర్‌ ట్రెయినర్లను సిద్ధం చేశారు.

శిక్షణ షెడ్యూల్‌ ఇలా..

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాభివృద్ధిలో పల్లె సారథులదే కీలక పాత్ర. రెండేళ్లుగాగ్రామాలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడ్డాయి. పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎనిమిది మంది మాస్టర్‌ ట్రైనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయింది. ఈ నెల 19 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. – సాక్షి, సిద్దిపేట

సద్వినియోగం చేసుకోండి

జిల్లాలోని సర్పంచులు, వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 19 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ పూర్తి అయింది. సర్పంచ్‌లకు న్యాక్‌ సెంటర్‌లో, వార్డు సభ్యులకు ఆయా మండల కేంద్రాల్లో శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.

– రవీందర్‌, డీపీఓ

పల్లె సారథులకు శిక్షణ 1
1/1

పల్లె సారథులకు శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement