సిట్‌పై బీఆర్‌ఎస్ భగ్గు
● నోటీసులకు నిరసనగా
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
● రాజీవ్ రహదారిపై
గౌరారం వద్ద భారీ ధర్నా
వర్గల్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసుల జారీపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం ఉదయం ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ నందీనగర్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్ అధినేతకు గౌరారం వద్ద రాజీవ్‌రహదారిపై పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.
మిరుదొడ్డిలో రాస్తారోకో
మిరుదొడ్డి(దుబ్బాక): బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల యువత అధ్యక్షుడు ధర్మారం కుమార్, ధర్మారం బాబు తదితరులు పాల్గొన్నారు.
అక్బర్‌పేట–భూంపల్లిలో...
అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎం చిత్ర పటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు జరిగిన ఆందోళనతో సిద్దిపేట– రామాయంపేట జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
సిట్‌పై బీఆర్‌ఎస్ భగ్గు


