పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆదివారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కపకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఎల్లమ్మ దేవాలయంలో
చండీ హోమం
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం చండీ హోమం నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పచ్చిమట్ల రవీందర్‌గౌడ్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్‌రావు, అర్చకులు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా
గురు రవిదాస్ జయంతి
గజ్వేల్: పట్టణంలో మోచి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గురు రవిదాస్ మహరాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు వేణు, నాయకులు బైరి రవి, ప్రభాకర్, బైరి ప్రభాకర్‌లు మాట్లాడుతూ కులవ్యవస్థను, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ గురు రవిదాస్ సమతావాదాన్ని బోధించారని కొనియాడారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి


