సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం | - | Sakshi
Sakshi News home page

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం

Feb 2 2026 8:21 AM | Updated on Feb 2 2026 8:21 AM

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తాచాటుదామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక కొమ్మూరి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డు ఒగ్గు వెంకటమ్మ, 2వ వార్డు ముస్త్యాల తేజ, 3వ వార్డు కొమ్ము రాజేశ్వరి, 4వ వార్డు వంగ జయలక్ష్మి, 5వ వార్డు వెలుగల దుర్గయ్య, 6వ వార్డు ముస్త్యాల కృష్ణ, 7వ వార్డు పోతుగంటి ప్రసాద్‌, 8వ వార్డు సందుల సురేష్‌, 9వ వార్డు మామిడాల నాగరాజు, 10వ వార్డు తుమ్మలపల్లి లీల, 11వ వార్డు గుస్క వాసంతి, 12వ వార్డు షరీఫాబేగం పేర్లను ప్రకటించారు. ఎంపీ చామల, కొమ్మూరి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. చేర్యాల మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని, అందుకు ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు.

గజ్వేల్‌: ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలిస్తే.. బీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మలను దహనం చేయడం ఏమిటని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు అసహ్యించుకునే రోజులు వచ్చాయని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు గోపాల్‌రావు, తీగుల్‌ మాజీ సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

పీసీసీ రాష్ట్ర అధికార

ప్రతినిధి శ్రీకాంత్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement