ఈసారీ నిరాశే.. | - | Sakshi
Sakshi News home page

ఈసారీ నిరాశే..

Feb 2 2026 8:21 AM | Updated on Feb 2 2026 8:21 AM

ఈసారీ

ఈసారీ నిరాశే..

కేంద్రబడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి కేటాయింపులు లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. పర్యాటక ప్రగతి ఊసేలేకపోగా, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కలేదు. అయితే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి మందుల ధరలు కొంత తగ్గనున్నాయి. అలాగే విదేశాలలో విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారికి కొంత ప్రోత్సాహంగా ఉండనుంది. ఇంకా రైల్వేకు సంబంధించి బడ్జెట్‌ను కేటాయించారు. కానీ రైల్వే ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా కేటాయింపులు జరగలేదు.

– సాక్షి, సిద్దిపేట

నోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి(కరీంనగర్‌) వరకు 152 కిలోమీటర్లు ఉండగా సిద్దిపేట(76.5కిలో మీటర్లు) వరకు రైల్వే లైన్‌ పూర్తయింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 30కిలో మీటర్లు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. సిద్దిపేట వరకు సైతం ఒకటే రైలు. అది స్లోగా వెళ్తుండటంతో ప్రయాణికులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ రైలు స్పీడ్‌ దాదాపు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్లు స్పీడ్‌ మాత్రమే వెళ్తుండటంతో సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే దాదాపు 3గంటలకు పైగా పడుతుంది. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు రైల్వేలైన్‌ పనులు నత్త నడకన సాగుతున్నాయి. అలాగే మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్‌ విద్యుదీకరణ చేపడితే రైలు స్పీడ్‌ పెరగనుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.

దక్కని ఊరట

కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులు, వ్యాపార వర్గాలకు షాక్‌ తగిలింది. ఈ బడ్జెట్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శ్లాబ్‌లలో మార్పులు ఉంటాయని అందరూ భావించారు. కానీ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. జిల్లాలో దాదాపు 90వేల మందికి పైగా ఆదాయపు పన్నులు చెల్లిస్తుంటారు.

క్యాన్సర్‌ రోగులకు ఉపశమనం

క్యాన్సర్‌ రోగులకు కొంత ఉపశమనం కలిగింది. 17 రకాల క్యాన్సర్‌ మందులపై సుంకాన్ని తగ్గించారు. ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది. జిల్లా వ్యాప్తంగా 600మందికి పైగా రోగులున్నారు.

బాలికల హాస్టల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు బాలికల హాస్టల్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. జిల్లాకు బాలికల హాస్టల్‌ రానుంది. బాలికల హాస్టల్‌ ఏర్పాటు అయితే విద్యను అభ్యసించే వారి సంఖ్య పెరగనుంది.

పల్లెలు, పట్టణాలకు..

కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు జనాభా వారీగా నిధులను ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయిస్తోంది. జిల్లాలో 506 గ్రామపంచాయతీలకు నిధులు రానుండటంతో పల్లెలు అభివృద్ధి చెందనున్నాయి. పట్టణాభివృద్దికి రూ85,522కోట్లను కేటాయించడంతో ఐదు మున్సిపాలిటీలలో 115 మున్సిపల్‌ వార్డులకు నిధులు రానున్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గింపు

ఈవీ కార్లు, ద్విచక్రవాహనాల ధరలు తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గటంతో పాటు వాహనదారులకు ఖర్చు నుంచి విముక్తి లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 40వేల మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగిస్తున్నారు.ఈ వాహనాల ధరలు తగ్గితే వినియోగించే వారి సంఖ్య మరింత పెరగనుంది.

ఊసేలేని పర్యాటక ప్రగతి వేతన జీవులకు దక్కని ఊరట

సిద్దిపేట రైలు స్పీడ్‌ పెరిగేనా? జిల్లాకు బాలికల హాస్టల్‌

అంకెల గారడే..

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తెలంగాణకు పూర్తిగా నిరాశ కలిగించే విధంగా ఉంది. అంకెల గారడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. వ్యవసాయంతోపాటు పలు కీలకరంగాలకు కేటాయింపులు సముచితంగా లేవు. తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయమే.

– కొత్త ప్రభాకర్‌రెడ్డి , ఎమ్మెల్యే దుబ్బాక, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

వంచించిన కేంద్రం

రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలకు ఎలాంటి కేటాయిపులు, ప్రకటనలు చేయలేదు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి జీరామ్‌జీ పథకం ద్వారా రాష్ట్రాలకు 40 శాతం భారాన్ని మోపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా కేటాయించారు. కేంద్రం తమ పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపడం పట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి.

– మంద పవన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి

అన్ని వర్గాలకూ అనుకూలం

తిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్‌ ఎంతో దోహదపడుతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంది. దేశాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతాంగం, యువతకు ప్రాధాన్యమిచ్చారు. ఈ బడ్జెట్‌ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది.

– బాసంగారి వెంకట్‌,

బీజేపీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు

నిరాశపరిచింది..

ఆదాయపు పన్ను చెల్లింపులు శ్లాబులు పెరుగుతాయని భావించాం. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో చాలా బాధాకరం. విద్యారంగానికి బడ్జెట్‌ మేలు జరిగే విధంగా ఉంది గతంలో కంటే ఈసారి బడ్జెట్‌ పెంచడం సంతోషదాయకం.

– ఇంద్రసేనారెడ్డి,

పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఈసారీ నిరాశే..1
1/5

ఈసారీ నిరాశే..

ఈసారీ నిరాశే..2
2/5

ఈసారీ నిరాశే..

ఈసారీ నిరాశే..3
3/5

ఈసారీ నిరాశే..

ఈసారీ నిరాశే..4
4/5

ఈసారీ నిరాశే..

ఈసారీ నిరాశే..5
5/5

ఈసారీ నిరాశే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement