‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులకు లబ్ధి
3వ వార్డు కౌన్సిలర్ వంగ రేణుక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సాక్షి దినపత్రికలో ప్రతి రోజు అందిస్తున్న స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకురుస్తుందని 3వ వార్డు కౌన్సిలర్ వంగ రేణుక అన్నారు. రంగదాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు ఆమె ఆధ్వర్యంలో సాక్షి స్టడీ మెటీరియల్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టడీ మెటీరియల్‌ను నిపుణుల సాయంతో రూపొందించారన్నారు. ఈ స్టడీ మెటీరియల్ ద్వారా రానున్న వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని సూచించారు. రూ.250కే స్టడీ మెటీరియల్ అందించడం ఆహ్వానించదగిన విషయమని, విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


