మెనూ కచ్చితంగా పాటించాలి
● కలెక్టర్ హైమావతి
● తిమ్మాపూర్‌లో మధ్యాహ్న భోజనం పరిశీలన
గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును గురువారం కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం జగదేవ్‌పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రోరల్ మ్యాపింగ్‌ను వేగం చేయాలి
కొండపాక(గజ్వేల్): ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ వేగం చేయాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొండపాకలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ తీరును గురువారం పరిశీలించారు. పనుల నత్తనడకపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ త్వరలో 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఆయా వార్డుల వారీగా జీసీఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో బీఎల్‌ఓల పనితీరును ఎప్పటికప్పుడు తహసిల్దార్ పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు చేసుకోవాలన్నారు. ఏరోజుకారోజు మ్యాపింగ్ వివరాలను అప్‌లోడ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి, ఆర్‌ఐ బాలకిషన్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


