పేదలకు అధునాతన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

పేదలకు అధునాతన వైద్య సేవలు

Mar 15 2026 6:45 AM | Updated on Mar 15 2026 6:45 AM

దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అధునాతనమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో ఎన్‌టీపీసీ సహకారంతో సీఎస్‌ఆర్‌ నిధులు రూ.25 లక్షలతో ఏర్పాటైన ల్యాప్రోస్కోపిక్‌ సర్జరి పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే దుబ్బాక ఆస్పత్రి ఎన్నో క్రిటికల్‌ సర్జరీలతో పేదల ప్రాణాలు కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మారుమూల ప్రాంతంలోని పేదప్రజలకు అధునాతనమైన వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం చొరవతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దుబ్బాక ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసౌకర్యాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలికలకు వేస్తున్న హెచ్‌పీవీ టీకా కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగీత, వైస్‌ చైర్‌పర్సన్‌ సులోచన, కౌన్సిలర్‌ దేవుని రాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హేమరాజ్‌సింగ్‌, ప్రజాప్రతినిధులు భానుప్రసాద్‌, సాయికుమార్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు

దుబ్బాక ఆస్పత్రిలో

ల్యాప్రోస్కోపి పరికరాలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement