ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
హుస్నాబాద్/చేర్యాల(సిద్దిపేట)/గజ్వేల్/దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినే షన్లు వేశారు. హుస్నాబాద్‌లో మొత్తం 149 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ 39, బీజేపీ 33, బీఆర్‌ఎస్ 39, సీపీఐ 5, జనసేన 5, బీఎస్పీ 6, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) 1, ఇండిపెండెంట్లు 21 మొత్తం 149 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ హైమావతి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అయేషా మస్రత్ ఖానమ్ పరిశీలించారు. అలాగే చేర్యాల మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు 59 నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. చివరి రోజు 85 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. మూడు రోజులుగా వచ్చిన నామినేషన్ల వివరాలు పార్టీల వారీగా బీఆర్‌ఎస్ 26, కాంగ్రెస్ 31, బీజేపీ 13, సీపీఎం 2, సీపీఐ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, బీఎస్పీ 1, ఇతరులు 9 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లో చివరి రోజు శుక్రవారం 185 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కాంగ్రెస్ 53, బీఆర్‌ఎస్ 57, బీజేపీ 40, బీఎస్పీ 1, సీపీఎం నుంచి 1 నామినేషన్లు దాఖలుకాగా, ఇండిపెండెంట్లు 21 మంది, మరో 12 మంది ఇతర రిజిష్టర్డ్ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు వెల్లడించారు. దుబ్బాక మున్సిపాల్టిలో చివరిరోజున 145 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 235 నామినేషన్లు వచ్చినట్లు కమిషనర్ రమేశ్‌కుమార్ తెలిపారు.


