నిబంధనలే ముఖ్యం.. సీపీ సందేశం
‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది.. గాలి పటం ఎగురవేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అలాగే వాహనాలు నడిపే వేళ అంతే ఏకాగ్రతతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలి’ అని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ సందేశం ఇచ్చారు. బుధవారం పోలీసు కమిషనరేట్ పరేడ్ మైదానంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కై ట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి సీపీ గాలి పటాలను ఎగురవేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కుషాల్కర్, సుభాష్ చంద్రబోస్, అన్ని డివిజన్ల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. – సిద్దిపేటకమాన్


