పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు
● కలెక్టర్ హైమావతి ● దుబ్బాకలో నామినేషన్ ప్రక్రియ పరిశీలన
దుబ్బాకటౌన్: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతారణంలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 రోజుల పాటు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం దుబ్బాక మున్సిపల్ పరిధిలోనీ దుంపలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాసిరకం మధ్యాన భోజనం అందిస్తే సహించేది లేదని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు.
నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ
చేర్యాల(సిద్దిపేట): ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని, పోటీ చేసే అభ్యర్థులందరూ సహకరించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. పట్టణ కేంద్రంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి సెంటర్‌కి వచ్చిన సమయం నుంచి నామినేషన్ వేసి బయటికి వెళ్లే వరకు వీడియో తీయించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు.


