మార్కండేయుడి కృప అందరిపై ఉండాలి
దుబ్బాక: మార్కండేయుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో మార్కండేయ జయంతిని పద్మశాలి సమాజం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలి సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో పద్మశాలి సమాజం అధ్యక్షుడు జిందం గాలయ్య, యువజన సంఘం అధ్యక్షుడు నరేశ్‌తో పాటు కులపెద్దలు తదితరులు ఉన్నారు.


