వైభవంగా కొండపోచమ్మ జాతర షురూ..
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ఆకట్టుకున్న బోనాల ఊరేగింపు
గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లోని కొండపోచమ్మ ఆలయంలో సోమవారం జాతర వైభవంగా ప్రారంభమైంది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పట్నం వారం కావడంతో...మల్లన్నను దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ ఆశీస్సుల కోసం వేల సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్లు మధ్య మహిళలు నృత్యాలు చేస్తూ, శివసత్తులు సిగాలు ఊగుతూ, పోతరాజులు తమ విన్యాసాలను ప్రదర్శించడం ఆకట్టుకున్నది. ప్రత్యేకించి లష్కర్ బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
వైభవంగా కొండపోచమ్మ జాతర షురూ..
వైభవంగా కొండపోచమ్మ జాతర షురూ..


