పాలన చేతకాక.. కేసీఆర్‌పై కుట్రలు
గజ్వేల్: పాలన చేతకాక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం బీఆర్‌ఎస్ శ్రేణులు గజ్వేల్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అక్రమ కేసులు, నోటీసులతో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని ఏమీ చేయలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు పాల్గొన్నారు.


