మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదాలు
బెజ్జంకి(సిద్దిపేట): మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎస్‌ఐ సౌజన్య అన్నారు. బెజ్జంకిలో రోడ్డు భద్రత, నిబంధనలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులతో వాహనదారులకు పువ్వులు ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శంకర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు తప్పనిసరి
దుబ్బాకటౌన్: రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్‌ఐ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా దౌల్తాబాద్‌లో వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ అత్యంత ఉద్యోగులందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఇన్‌చార్జి ఎంపీడీఓ సయ్యద్ గపూర్ ఖాద్రి, హెడ్ కానిస్టేబుల్ విక్రమ్, కానిస్టేబుల్స్ రాజుగౌడ్, నవీన్, షఫీ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు
గజ్వేల్‌రూరల్: ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలను పాటించాలని, మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని సీఐ రవికుమార్ అన్నారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రత, నిబంధనలపై అవగాహన కల్పించా రు. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్, ముగ్గుల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుతులను అందజేశారు.


