మోడల్ స్కూల్‌లో ప్రవేశాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీశ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఓసీ విద్యార్థులు రూ.200, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.125 ఫీజు చెల్లించాలని చెప్పారు.
బెజ్జంకిలో..
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శివారులోని ఎల్లంపల్లెలోగల మోడల్ స్కూల్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మాలోతు సంగీత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 28 నుంచి ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ముస్త్యాలలో..
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ముస్త్యాల మోడల్ స్కూల్‌లో 6వ తరగతిలోని 100 సీట్లకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్షకు 28 నుంచి వచ్చే నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠ శాల ప్రిన్సిపాల్ జీనుగు భిక్షం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రక్షణశాఖకు ఎంపిక
అభినందనీయం
తొగుట(దుబ్బాక): రక్షణశాఖలో ఉద్యోగం సాధించడం అభినందనీయమని పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి అన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కేంద్ర ప్రభుత్వ రక్షణశాఖలో ఉద్యోగాలకు ఎంపికై న ముచ్చర్ల రాజు, బండారు అఖిలతో పాటు వారి తల్లిదండ్రులను ఆయన శనివారం సన్మానించారు. రాజు సీఐఎస్‌ఎఫ్, అఖిల అస్సాం రైఫిల్స్‌కు ఎంపికై గ్రామానికి గుర్తింపుతీసుకువచ్చారని అభినందించారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించడం గొప్పవిషయమన్నారు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, మాజీ ఎంపీటీసీ రమేశ్, నాయకులు శ్రీకాంత్, గణేశ్, దేవేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
గోరక్ష సహ ప్రముఖ్‌గా రాజారాం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర గోరక్ష సహ ప్రముఖ్‌గా జిల్లాకు చెందిన గ్యాదరి రాజా రాం నియామకమైనట్టు జిల్లా నాయకులు శనివారం తెలిపారు. పాలమూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సభలలో రాజారాంను ఎంపిక చేశారన్నారు.
పోల్ ఎక్కి..
సమస్య పరిష్కరించి
అక్కన్నపేట(హుస్నాబాద్): ఈ ఫోటోను చూశారా.. నిచ్చెన సహాయంతో విద్యుత్ అధికారులు రిపేర్లు చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. మండలంలోని పంతుల్‌తండా సర్పంచ్ లావుడ్య రాజు అలియాస్ చిన్నానాయక్ స్వయంగా పోల్ ఎక్కి కాలిపోయిన బోరు మోటరు వైర్లను తొలగించి కొత్త వైర్లను ఏర్పాటు చేశారు. అలాగే మునిగిపోయిన ఎర్తింగ్ పైపును కూడా తానే బయటకు తీసి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు.
గుగ్గిల్లలో ఉచిత
పశువైద్య శిబిరం
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్లలో పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో శనివారం గోపాల మిత్ర ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ ఉచిత పశువైద్య శిబిరాల వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పశువైద్యాధికారి హరిత, ఎండీ షాదుల్లా, ఉపసర్పంచ్ లావణ్య, కార్యదర్శి 0 వంశీ, గోపాలమిత్రలు, వార్డు సభ్యులు సత్తయ్య, లక్ష్మయ్య, భూపతి, రాజిరెడ్డి, కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో ప్రవేశాలు
మోడల్ స్కూల్‌లో ప్రవేశాలు


