వాటర్‌ప్లాంట్ ఏర్పాటు అభినందనీయం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మద్దూరు(హుస్నాబాద్): సొంత ఖర్చులతో ప్రజలకు రక్షిత నీటిని అందించడం అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశంసించారు. మండలంలోని రెడ్యానాయక్‌తండాలో కల రాం సాయికిరణ్‌రావు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు. ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మద్దూరు మండల కేంద్రంలో మృతి చెందిన పల్లె ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేక సంతోష్‌కుమార్, మంద యాదగిరి, మాజీ వైస్‌ఎంపీపీ మల్లిపెద్ది సుమలత, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


