వంద శాతం పన్నుల వసూలే లక్ష్యం
సిద్దిపేటజోన్: వంద శాతం పన్నుల వసూలు లక్ష్యం సాధించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ కోరారు. శనివారం స్థానిక 14వార్డులో ఒక నివాసానికి సంబంధించి రూ.2,54,592 ఇంటి పన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలన్నారు. వందశాతం పన్నులకు సహకరించి సిద్దిపేట బల్దియా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు. పట్టణంలో మంచి నీటిని వృథా చేయరాదని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్


