ఎస్‌టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిదిపేట): ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే విధులపై నిబద్ధతతో ఉండేలా చొరవ చూపాలని సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి రాజప్రభాకర్‌రెడ్డి సూచించారు. స్థానిక ఇందిరానగర్ హైస్కూల్‌లో శనివారం స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్‌టీయూ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. పెండింగ్ డీఏలు, ఆరోగ్య కార్డులు, సీపీఎస్ ఉద్యగుల కరువు భత్యం తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం నాయకులు గురవయ్య, యూసుఫ్, మండల ప్రధానకార్యదర్శి గంభీర్‌రావుపేట యాదగిరి, ఆర్థిక కార్యదర్శి బోడరాజు, నాయకులు వినోద్, ఫసియొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.


