గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి(సిద్దిపేట): గ్రామాలలో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే ప్రాధాన్యతనిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తోటపల్లి, బెజ్జంకి క్రాసింగ్, పోతారం, రేగులపల్లె తదితర గ్రామాలలో శనివారం పలు అభివృద్ధి పనులకు శంస్థాపన చేశారు. పోతారంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్ల సమస్య పరిష్కారానికి సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిర్చి సాగు లాభదాయకం
చిన్నకోడూరు(సిద్దిపేట): మిర్చి సాగు లాభదాయకమని, రైతులు మిర్చి సాగుకు ఆసక్తి చూపాలని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని గంగాపూర్‌లో మిర్చి మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న పంటలు కాకుండా కూరగాయలు, మిర్చి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిర్చి మార్కెట్‌లో విక్రయించాలన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు.
చేనేత కార్మికుల
రుణాలు మాఫీ
జిల్లా చేనేత, జౌళి శాఖ
సహాయ సంచాలకులు సాగర్
ిసద్దిపేటరూరల్: చేనేత కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వృత్తిపరమైన పరికరాలు, ముడిసరుకు కొనుగోలు నిమిత్తం వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేశారన్నారు. జిల్లాలోని ఏడుగురి కార్మికులకు చెందిన రూ.5 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
నేడు సామూహికసూర్య నమస్కారాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రథసప్తమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్‌రోడ్‌లో సూర్య నమస్కారాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 6.15 నుంచి 7.30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.


