విద్యార్థులే అభ్యర్థులు.. ఓటర్లు
ఎన్నికల నిర్వహణ, ఓటింగ్, కౌంటింగ్‌పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మాక్ పోలింగ్ చేపట్టారు. విద్యార్థులే అభ్యర్థులు.. ఓటర్లుగా పాల్గొని ప్రత్యక్ష అనుభూతిని పొందా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులే అన్ని తామై విజయవంతం చేశారు. మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికల ప్రక్రియ లాగే చేపట్టారు. ఎలక్షన్ కమిషనర్, పోలింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్, పోలింగ్ సిబ్బంది విధులను విద్యార్థులే నిర్వర్తించారు. ఎన్‌సీసీ విద్యార్థులు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికలు ఏ విధంగాజరుగుతాయో ఈ మాక్ పోలింగ్ ద్వారా తెలిసిందన్నారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు
బడిలో మాక్ పోలింగ్ భళా


