పారా అథ్లెటిక్స్‌లో దివ్యాంగుడి ప్రతిభ
మిరుదొడ్డి(దుబ్బాక): హైదరాబాద్ గచ్చిబౌ లిలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి పారా (వైకల్యం కలిగిన అథ్లెట్లు) అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో మిరుదొడ్డికి చెందిన దివ్యాంగుడు, తెలంగాణ వీల్ చైర్ క్రికెటర్ ఎర్రోళ్ళ పరశురాములు ప్రతిభ చాటారు. చాంపియన్‌షిప్‌లో షాట్‌ఫుట్, జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్, డిస్కస్ త్రోలో బ్రౌంజ్ మెడల్ సాధించారు. పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు దీప్తీ జీవంజి చేతుల మీదుగా మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో మెడల్స్ సాధించిన పరశురాములును గ్రామస్తులు శుక్రవారం అభినందించారు.
మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రాందేవ్ చంద్రశేఖర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో డాక్టరేట్ పట్టా పొందినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన చేసి ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారన్నారు. తమ అధ్యాపకుడికి డాక్టరేట్ రావ డం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రశేఖర్‌ను ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానించారు.
సిద్దిపేటకమాన్: గ్రూప్ 3 పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఆడిటర్‌గా ఎంపికై న కానిస్టేబుల్ ఎర్రవల్లి సందీప్‌రెడ్డిని టూటౌన్ సీఐ ఉపేందర్ అభినందించారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వ హిస్తున్న సందీప్‌రెడ్డి ఇటీవల వెలువడిన టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 3 ఫలితాల్లో ఆడిటర్‌గా ఎంపికయ్యారు. పోలీసు స్టేషన్‌లో శుక్రవారం సీఐ, సిబ్బంది సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూనే పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పోలీసు యూనిట్ నుంచి రిలీవ్ చేసినట్లు తెలిపారు. తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి సందీప్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మద్దూరు(హుస్నాబాద్): కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష విడనాడాలని, వారితో ప్రేమతో వ్యవహరించాలని మండల సర్పంచ్‌ల ఫోరం అధ్య క్షుడు శనిగరం సత్యనారాయణ సూచించారు. మండలంలోని నర్సయపల్లిలో శుక్రవారం కుష్ఠువ్యాధి నిర్మూలనా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠువ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అన్నారు. ఎండీటీ చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నమయవుతుందని, కుష్ఠు రహిత దేశం కోసం అందరు కృషి చేయాలని కోరారు. అనంతరం కుష్ఠువ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తొగుట(దుబ్బాక): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలని సర్పంచ్ పాగాల శోభ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడలను శుక్రవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రవీందర్, రమేశ్, ఏఎంసీ చైర్మన్ విజయ్‌రెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, తహసీల్దార్ సమీర్ అహ్మద్‌ఖాన్, ఎంపీడీఓ నాగేశ్వర్, సీఐ లతీఫ్, మాజీ సర్పంచ్ లు బాల్‌రెడ్డి, రాంరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు.
పారా అథ్లెటిక్స్‌లో దివ్యాంగుడి ప్రతిభ
పారా అథ్లెటిక్స్‌లో దివ్యాంగుడి ప్రతిభ
పారా అథ్లెటిక్స్‌లో దివ్యాంగుడి ప్రతిభ
పారా అథ్లెటిక్స్‌లో దివ్యాంగుడి ప్రతిభ


